నూతన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి కారులను ఘనంగా సన్మానించిన మంత్రి

July 13, 2026 | తెలంగాణ

: పయనించే సూర్యుడు జులై 14మక్తల్: లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం 12 జూలై ఆదివారం వట్టం రవి కన్వెన్షన్ హాల్ నందు మాజీ అధ్యక్షులు లయన్ఏ సత్యాంజనేయులు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ప్రోగ్రాం చైర్మన్ లయన్ జి.జయపాల్ రెడ్డి యొక్క స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమయింది. లైన్స్ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకులు లయన్ మెల్విన్ జోన్స్ చిత్రపటానికి అతిధులచే పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లయన్ డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని
ఉద్దేశించి వారు మాట్లాడుతూ సమాజంలో సేవ చేసేవాళ్లు చాలామంది ఉంటారు కానీ, సేవను పుచ్చుకునే వాళ్లు ఉన్నప్పుడే సేవ చేసే వారికి అవకాశం ఉంటుందని పుచ్చుకునేవారు లేనప్పుడు సేవ చేసే భాగ్యము కలగదని తెలియజేశారు. అదే విధంగా లైన్స్ ఐ హాస్పిటల్ నిర్మాణానికి ప్రస్తుతం నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పరిసరాల్లో అర్థ ఎకర స్థలము ఇవ్వడానికి అంగీకారం తెలియజేశారు.ఇన్స్టలేషన్ ఆఫీసర్ లయన్ యం. ప్రేమ్ కుమార్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ నూతన అధ్యక్షులు లయన్ టి నాగరాజు, కార్యదర్శి లయన్ ఎస్ రమేష్ రావు, కోశాధికారి లయన్ బి అంబాదాసు రావుఇతర కార్యవర్గము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ప్రమాణస్వీకారం చేయించారు. మక్తల్ లైన్స్ క్లబ్ డిస్టిక్ 320ఎ నందు అత్యుత్తమ సేవలకు పేరుగాంచినదని ఎన్నో అవార్డులు పొందినదని భవిష్యత్తులో కూడా నూతన కమిటీ సభ్యులు కలిసి లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమాకు ఉత్తమ సేవల ద్వారా మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ సేవరత్న లయన్ నటరాజ్ పి టి జి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బీదవారికి వర్షం వస్తే గుడిసెలు కారకుండా అలాంటి కుటుంబాలను ఎంపిక చేసుకొని వారికి తాడిపత్రిలను అందించాలని క్లబ్ సభ్యులకు 15 తాడిపత్రిలను అందించారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి డాక్టర్స్ డే సందర్భంగా లయన్Dr పి.శ్రీరామ్ లయన్ Dr.అశోక్ లయన్ Dr.మణికంఠ గౌడ్ టీ.అక్షయ్ కుమార్ లను శాలువతో సత్కరించి సర్టిఫికెట్స్ అందజేశారు. నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిగారిని శాలువతో పూలకుండితో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికి గాను క్లబ్ యొక్క ఇంటర్నేషనల్ ఫీజు కు సంబంధించిన రెండు లక్షల 50 వేల రూపాయల చెక్కును మంత్రి చేతుల మీదుగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ ఎం. కుమార్ టి డి జి .కి అందజేశారు.కార్యక్రమానికి విచ్చేసిన రీజియన్ చైర్ పర్సన్ లయన్ కె.మోహన్ గౌడ్ లయన్ సరితలను శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో నారాయణపేట క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ ఆత్మారాం హెడికే, అధ్యక్షులు రవికుమార్ ఉట్కూర్ క్లబ్ అధ్యక్షులు జయసింహారెడ్డి,సభ్యులు వై జనార్దన్ రెడ్డి, మశ్చీంద్ర రెడ్డి, రాయచూర్ క్లబ్ నుండిలయన్ పరిటాల రాము పాస్ట్ ఆర్ సి హాజరైనారు. అదేవిధంగా మక్తల్ సీనియర్ లయన్ సభ్యులు వి నరేందర్,డి బసవరాజ్ ,బి కొండయ్య, ప్రోగ్రాం కో చైర్మన్
జి శరణప్ప, సిద్ధి లింగయ్య, సుజాత మేడం అరుణ మేడం, జయశ్రీ మేడం, ఆడెం శ్రీనివాస్, కట్ట వెంకటేష్, పాపిరెడ్డి, డి.వి చారి,. అంజన్ ప్రసాద్, ఆడం సత్యనారాయణ, కోళ్ల వెంకటేష్, సుకన్య శేఖర్, కావలి తాయప్ప, తాన్సింగ్, భార్గవ్ రానా, కర్ని స్వామి, రమేష్ కుమార్, కాకులారం అశోక్, వట్టమ్ రతన్ కుమార్ గుప్తా,.రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లయన్ రవికిరణ్ లయన్ డివి.చారి పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper