జూలై 17న కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సందర్బంగా.
కులాధిపత్యం మరియు : దక్షిణ భారతదేశంలో దళిత అస్తిత్వ రాజకీయాలపై ప్రొఫెసర్ కే శ్రీనివాసులు రచించిన పుస్తకం చర్చ
:పయనించే సూర్యుడు జులై15 మక్తల్ :దక్షిణ భారతదేశంలో కుల ఆధిపత్యం మరియు ప్రతిఘటన దళిత అస్తిత్వ రాజకీయాలు అనే టైటిల్ తో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె శ్రీనివాసులు పుస్తకం రాశారు.కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో ఆ పుస్తకం పై చర్చ ను తేది:17-07-2026 మధ్యాహ్నం 2 గం.లనుండి రాత్రి 9 గం.లవరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం,హైదరాబాదులో నిర్వహిస్తున్నాము. ప్రొ.శ్రీనివాసులు కర్లి ఆ పుస్తకంలో
భారత దేశ రాజకీయాల్లో కులం పోషిస్తున్న పాత్రను సమగ్రంగా లోతులోకి వెళ్లి విశ్లేషించారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించి 1980-90 దశాబ్దాలలో జరిగిన చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన దళిత ఉద్యమం తదితర పరిణామాలు, పర్యావసనాలు, కులం, వర్గం, కులవర్గ సిద్ధాంతాలపై జరిగిన చర్చనంతా ఒక పుస్తక రూపంలో తీసుకురావడం ఒక గొప్ప విషయంగా అరుదైన సందర్భంగా మనం చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న పౌర హక్కుల సంఘం దళితులపై దాడులు విషయంలో నివేదికలు తీసుకువచ్చింది. నలుపు, దళిత శక్తి, బహుజన కెరటాలు లాంటి పత్రికలు కూడా నివేదికలను ప్రచురించాయి. ఎదురీత, కుల నిర్మూలన పత్రికలు మరియు కుల నిర్మూల పోరాట సమితి లాంటి సంస్థలు నివేదికలు మాత్రమే కాకుండా కుల వర్గ సిద్ధాంతాలపై చర్చించాయి.ఈ సమావేశంలో పుస్తక రచయిత ప్రొఫెసర్ కే శ్రీనివాసులు, ఉస్మానియా యూనివర్సిటీ,బండారి లక్ష్మయ్య, ప్రొ.కే.లక్ష్మీనారాయణ,ప్రొ.కే వై రత్నం, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.పద్మజాషా, ఉస్మానియా యూనివర్సిటీ, కొండూరి వీరయ్య, ఎడిటర్ తెలుగు వైర్,ఎన్. రాములు, కాకతీయ యూనివర్సిటీ,కె.జె రామారావు,తాత్విక సంపాదకులు,డాక్టర్ అండెం మధుసూదన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, కేయూ,డాక్టర్ పుల్లూరు సంపత్ రావు, లెక్చరర్,గన్నారపు సరోజన, రాష్ట్ర అధ్యక్షురాలు,కోనాల లాజర్, సామాజిక కార్యకర్త ఆంధ్ర ప్రదేశ్,ఈరపాగ గోవింద్ ,రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఎర్ర మోహనకృష్ణ,రాష్ట్ర కోశాధికారి,తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధి జీవులు, సామాజిక వేత్తలు ,మేధావులు విద్యార్థులు, మహిళలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము.కరపత్రాలు ఆవిష్కరించిన వారు. ఎస్ లక్ష్మయ్య కుల అసమాన తల నిర్మూలన పోరాట సమితి నారాయణపేట జిల్లా కన్వీనర్ సువర్ణ సుజాత కే గోపాల్ వీరన్న హోలియో దాసరి సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ ఏ భీమన్న కే తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.