ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడపత్రికను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్
:పయనం చేసే సూర్యుడు 15మక్తల్: మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 15 నుంచి రెండో విడత దోస్తు అప్లికేషన్స్ ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడపత్రికను మున్సిపల్ చైర్మన్ వాటికి మానస హనుమంతు, వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని, పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ నాగశివ, వార్డు కౌన్సిలర్ లు సరిత గోవిందరావు, రహీం పటేల్, మంజూరు ఇలాహి, కో ఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, టౌన్ ప్రెసిడెంట్ రవి కుమార్, కాడిగి హనుమంతు, కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.