ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తా బాసు నాయక్
పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లారం శేఖర్ రెడ్డి
( పయనించే సూర్యుడు మే 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఫాతిమా మబూత్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తవడంతో గురువారం రోజు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిద్దాపూర్ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం బాసు నాయక్ మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాసు నాయక్ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లారం శేఖర్ రెడ్డి వార్డు సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి, మండల మహిళా అధ్యక్షురాలు మిశ్రుత్ బేగం తదితరులు పాల్గొన్నారు.