సూళ్ళూరుపేటలో జోరందుకున్న చాయ్ విత్ జనసైనిక్స్

July 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూలై 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని బాపూజీ కాలనీలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చాయ్ విత్ జనసైనిక్స్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, పార్టీ నాయకులు షేక్ మాభాష నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం బాపూజీ కాలనీ ప్రాంతంలో ఆవుల దాస్ ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ’ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని నాయకులు సూచించారు. కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుకుంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నక్క హరిబాబు, కయ్యాలకోటి, వల్లూరు రాజా, ఏంబేటి ప్రవీణ్, కళ్యాణ్, రాజ్ కుమార్, బాలకృష్ణ, తో పాటు వీర మహిళ సుజాత పాల్గొన్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలు, యువత ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలిపారు. స్థానికంగా ఉన్న యువతను పార్టీలో చేర్చుకోవడంతో పాటు, అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు

🌐 Select Language:
📰 ePaper