బీఆర్ఎస్ కార్యకర్త జయకృష్ణ మృతికి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సంతాపం

July 23, 2026 | సినిమా వార్తలు

( పయనించే సూర్యుడు జూలై 24 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూఖ్‌నగర్ మండలం రాసమల్లగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎత్తిన జయకృష్ణ కరెంట్ షాక్‌కు గురై అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా జయకృష్ణ స్వగ్రామమైన రాసమల్లగూడకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. జయ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన అంజయ్య యాదవ్, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper