*డిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన లాఠీ చార్జీ లో సాక్షి కుటుంబనికి ప్రభుత్వం ఆదుకోవాలి.
పయనించే సూర్యుడుD.23.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.ఢిల్లీ జంతర్వంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ కు నిరసనగా 21మంగళ వారం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసి సాక్షి అనే అమ్మాయి మరణానికి కారకులైన పోలీసులపై చర్య తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనికేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ సాక్షి అనే అమ్మాయి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది.ఈ సందర్భంగా పిడియాస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు డి నిఖిల్, రాజు లు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడాని తీవ్రంగా ఖండించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 157 సార్ల పేపర్ లీకేజ్ అయిందని ఈ పేపర్ లీకేజీ వల్ల లక్షల కుటుంబాల జీవితాలు సర్వనాశనమయ్యాయని పేపర్ లీకేజీ కి కారణం కారకులైన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో జరిగిన లాఠీచార్జిలో చాలామంది విద్యార్థులకు గాయాలయ్యాయని ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని లేదంటే ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు వినోద్, శివానీ వచ్చల సురేఖ కృష్ణవేణిలతో పాటు 200 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.