భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా పట్టణంలోనిస్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యార్థులు, సిబ్బందికి యాంటీ డ్రగ్స్ (మాదకద్రవ్యాల నిరోధం) మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భైంసా సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ. శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి యువత మాదకద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు వహించాలని, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. సంతోష్ కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రవి కుమార్, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ భీమారావు, డాక్టర్ ఎం. శంకర్, డాక్టర్ నాహెద్, రాజు, డాక్టర్ కల్పనలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.