ముమ్మిడివరంలో ఘనంగా మెగా పేరెంట్స్ డే – విద్యామిత్ర కిట్ల పంపిణీ

July 24, 2026 | సినిమా వార్తలు

ప య నించే సూర్యుడు జూలై 24 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం ఐ.పోలవరం ఉన్నత పాఠశాలలో ‘మెగా పేరెంట్స్ డే’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు. కిట్లను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అందజేశారు.తల్లిదండ్రుల పాత్ర కీలకంఈ కార్యక్రమంలో కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ మాట్లాడుతూ పిల్లల విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం చాలా ముఖ్యమని అన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని, అన్ని వసతులతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని అన్నారు. విద్యామిత్ర కిట్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహరావు, ఐ.పోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, ఐ.పోలవరం ప్యాక్స్ అధ్యక్షులు కాకర్లపూడి బుజ్జి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper