PS Telugu News
Epaper

వందేమాతరం భరతమాత గౌరవానికి ప్రతీక..

📅 07 Nov 2025 ⏱️ 6:49 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వందేమాతర గీతం మన స్వాతంత్ర్య పోరాటానికి శక్తిగా నిలిచింది..

ఈ గీతాన్ని ప్రేరణగా తీసుకుని వికసిత్ భారత్ లక్ష్యంగా నేటి యువతరం ముందుకు నడవాలి..

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు–నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి..

( పయనించే సూర్యుడు నవంబర్ 7 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

వందేమాతర గీతం వెలువడి నేటితో 150 సంవత్సరంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో షాద్ నగర్ పట్టణంలో కాకతీయ హై స్కూల్ లో కాకతీయ టెక్నో స్కూల్ డైరెక్టర్ వంశీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవానికి ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.వారితో పాటు మల్చలం మురళి, టౌన్ అధ్యక్షులు హరిభూషణ్ , మఠం ఋషికేష్, మల్చలం రాము, గజ్జల ప్రవీణ్, రామకృష్ణ యాదవ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం ఒక గీతం కాదని, ఇది భారత మాత గౌరవానికి ప్రతీక! అని అన్నారు. ఇది మన స్వాతంత్ర్య పోరాట యోధుల రక్తంలో ఉత్సాహం నింపిన శక్తి! అని అన్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రాసి, స్వాతంత్ర్య సమరంలో మన యోధులకు ప్రేరణనిచ్చారని అన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్, వీర సావర్కర్ వంటి మహనీయులు “వందే మాతరం” నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించారని అన్నారు.
కానీ ఈ రోజుల్లో కొంతమంది వందేమాతర గీతాంన్ని ద్వేషిస్తున్నారని, ఈ గీతం అన్ని మతాల వాళ్ళను కలుపుకుంటూ పోతుందని అన్నారు. వందేమాతరం గీతాన్ని ప్రేరణ గా తీసుకొని వికసిత్ భారత్ లక్ష్యంగా నేటి యువతరం ముందు కొనసాగాలని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top