PS Telugu News
Epaper

ఆర్టీసీ బస్సు దగ్ధం ఘటనపై అధికారులు దర్యాప్తు – సంతోషకరంగా ప్రయాణికులు సురక్షితం

📅 08 Nov 2025 ⏱️ 1:26 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఇంజిన్‌లో పొగలు చూసిన డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేసి, బస్సులోని ఐదుగురు ప్రయాణికులను దింపేశాడు. ఈ క్రమంలో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించటంతో వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలార్పారు. అయితే బస్సు అప్పటికే మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించాలని ఆమె ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రికి అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదం గురించి తెలుసుకొని మంత్రి అచ్చెన్నాయుడు పోలీసులతో మాట్లాడి వివారలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ, ఆర్టీసీ సంయుక్తంగా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Scroll to Top