PS Telugu News
Epaper

ధైర్యవంతుడైన యువకుడు! కళ్లల్లో కారం కొట్టి చోరీకి ప్రయత్నించిన మహిళను పట్టేశాడు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఓ బంగారం దుకాణంలోకి కస్టమర్‌లా వెళ్లిన ఓ మహిళ కౌంటర్‌లో ఉన్న యువకుడికి కళ్లల్లో కారం కొట్టింది. నగల షాపులో చోరీ చేయాలని భావించింది. అయితే, వెంటనే తేరుకున్న ఆ యువకుడు ఆ మహిళ తుక్కు రేగ్గొట్టాడు. ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ముఖంపై 25 సెకన్లలో దాదాపు 20 పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఊహించని పరిణామానికి ఆ లేడీ కేడీ భయపడిపోయింది. నవంబర్ 3న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దుపట్టాతో ముఖాన్ని కప్పుకున్న ఆ మహిళ అహ్మదాబాద్‌లోని రణీప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని బంగారం, వెండి దుకాణంలో కస్టమర్‌లా నటిస్తూ ప్రవేశించింది. ఆ వెంటనే ఆమె అకస్మాత్తుగా దుకాణదారుడి కళ్లలోకి మిరప పొడి వేసింది. అయితే కారం అతడి కళ్లలో సరిగ్గా పడలేదు. ఆ మహిళ ఉద్దేశాన్ని గ్రహించిన దుకాణదారుడు వెంటనే లేచి కౌంటర్‌పైకి ఎగిరి ఆమెను బయటకు లాగుతూ కొట్టాడు. దుకాణదారుడు ఈ ఘటనపై ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించాడని, అయినప్పటికీ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేయాలని వ్యాపారిని రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసినట్టు చెప్పారు.

Scroll to Top