PS Telugu News
Epaper

ఇల్లందు మార్కెట్ కమిటి కార్యాలయంలో జర్నలిస్టులతో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

📅 10 Nov 2025 ⏱️ 7:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్10 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని రాజుగా చేయాలని ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారుదానిలో భాగంగానే ఈ సంవత్సరం అకాల వర్షాలతో రైతుల యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారికి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన మొక్కజొన్న వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస మొక్కజొన్న క్వింటాకు 2400రూ”వరి క్వింటాకు 2389రూ”మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.*కాని కమ్యనిస్టు పార్టీకి చెందిన వారు దళారులతో కుమ్మకై సొంత ధర నిర్ణయిస్తూ మొక్కజొన్న క్వింటాకు 1950రూ”గా కేటాయించి కొనుగోలు చేస్తున్నట్లుగా వారే సొంతంగా రేట్లు ప్రకటించినట్లుగా ప్రతికలో ప్రచురితం అయింది,నా ద్రృష్టికి వచ్చింది.వారి సొంతంగా ధర నిర్ణయించడానికి వారికి ఏమి హక్కు ఉంది, ప్రభుత్వం నిర్ణయించే ధర నిర్ణయించడానికి ప్రకటించడానికి వారు ఎవరు.
ప్రభుత్వం నిర్ణయించే ధరలను దళారులతో మీరే కుమ్మకై ధర ప్రకటించడం, పేద రైతులకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడం మీ పార్టీ సిద్ధాంతమా, మీ నైజమా గతంలో సీజన్ ప్రారంభం కాక ముందే కొమరారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాం ఏర్పాటు చేయాలని అధికారులకు నేను వినతి పత్రాలు అందచేసాను ఈ ఎడాది అధిక వర్షాలు దృష్ట్యా వ్యవసాయ మార్కెట్ ఇల్లందు లో అత్యవసరమైతే గౌడన్లలో సరుకును నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుందని రైతులకు నష్టం కలగకుండా ఉంటుంది అని మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాము త్వరలో కొమరారం కుడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం.మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరల కొమరాలలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గొర్రెలకు బర్రెలకు వెళ్ళి వినతి పత్రాలను అందిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు*
వారిని కమ్యూనిస్టు పార్టీ వారు అనాలా లేక ఏమి అనాలో అర్థం కావడం లేదు వారిలో వారికే నాలుగు వర్గాలుకమ్యూనిస్టు పార్టీ నాయకుడు మధుగారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి మీరంటే ప్రజలలో గౌరవం ఉన్నది ఈ విధంగా దళారులతో కుమ్మకై రైతులకు నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తే మీ మీద చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇంకా అడవుల్లో లేరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, నాటి రోజుల్లో నేడు కూడా కొనసాగిస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరుఇప్పటికైనా మీ విహార శైలి పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులందరికి మార్కెటింగ్ శాఖ ద్వారా నోటీసులు అందాయి 1950 రూపాయలకు ఎవరైనా కొనుగోలు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందిదళారులతో కుమ్మకైతే మీకు క్వింటాకు ఒక పది రూపాయలు దళారులు కమిషన్ ఇస్తారేమో కానీ మీ వలన వేలాది మంది పేద రైతులను నష్టపోతారు ఈ విషయం పత్రికా సోదరులు రైతులందరికి చేరవేయాలి ఇప్పటికైనా ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ వారు మీ పద్ధతి మార్చుకొని రైతులకు న్యాయం చేకూర్చే విధంగా ప్రజల కోసం కష్టపడే విధంగా పనిచేయాలి తప్ప మీ స్వలాభం కోసం కమిషన్ల కోసం దిగజారుడు రాజకీయాలకు పూనుకోవద్దు పాల్పడుద్దని ఈ సందర్భంగా రైతులందరూ ఇల్లందు మార్కెట్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం వద్ద క్వింటాకు 2400 రుపాయల చొప్పున మీ మొక్కజొన్నలు అమ్ముకోవాలని సూచిస్తున్నాను వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే వారు ఎవరైనా ఎంతటి వారైనా రైతులకు నష్టం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం ఇల్లందు టేకులపల్లి బయ్యారం మండలాల్లో అధికంగా రైతులు మొక్కజొన్న సేద్యం చేస్తూ ఉంటారువారికి ప్రభుత్వ పక్షాన ఈ ప్రాంత శాసన సభ్యునిగా రైతులందరికీ నష్టం జరగకుండా క్వింటాకు 2400 రూ” అందించేంతవరకు నిర్విరామంగా పనిచేస్తాం.ఏ దళారి అయినా రైతులు వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తే మా దృష్టికి తీసుకురండి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సమావేశంలో వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబుఇల్లందు సొసైటీ చైర్మన్ మెట్ల కృష్ణ, సొసైటీ డైరెక్టర్లు కిన్నెర నరసయ్య,రావుల రమేష్,బండారి శ్రీను స్ధానిక వ్వవసాయ శాఖ AO సతీష్,నాయకులు పూనెం సురేందర్ తదితరులు పాల్గోన్నారు..

Scroll to Top