సినిమా వార్తలు

చింతగూడకు కొత్త బస్సు సర్వీసు ప్రారంభం: 5 ఏళ్ల కష్టాలకు తెర

చింతగూడకు కొత్త బస్సు సర్వీసు ప్రారంభం: 5 ఏళ్ల కష్టాలకు తెర

బస్సును ప్రారంభించిన సర్పంచ్ నరేష్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్

​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

( పయనించే సూర్యుడు అక్టోబర్ 28 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ​ఫరూఖ్‌నగర్ గత ఐదేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చింతగూడ గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గ్రామానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ శుక్రవారం ప్రారంభించారు.ఈ బస్సు సౌకర్యంతో చింతగూడతో పాటు మార్గమధ్యలోని గ్రామాల మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధుల ప్రయాణ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రత్యేక చొరవ తీసుకుని బస్సు సర్వీసు మంజూరు చేయించిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు గ్రామస్తులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను గ్రామపంచాయతీ పాలకవర్గం శాలువాలతో ఘనంగా సన్మానించింది.​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకరయ్య, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS