వ్యవస్థలను నిర్వీర్యం చేయడం బాబు నైజం విక్రమ్ రెడ్డి
“మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను అడ్డుకుంటాం
పయనించే సూర్యుడు నవంబర్ 12 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరులో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ, ఆర్డీఓకు వినతిపత్రం సమర్పణ రాష్ట్రంలో ప్రజలకు వ్యవసాయం, విద్య, వైద్యం అందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర కృషి చేశారు, అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మాత్రం ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పాలన సాగిస్తున్నారని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆత్మకూరు పట్టణంలో బుధవారం ప్రజాఉద్యమం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత బస్టాండ్ సెంటర్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ ద్వారా తీరని అన్యాయం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో పేదలకు వైద్యం చేరువ చేయాలనే లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారని, అందులో ఐదు నిర్మాణాలు పూర్తి కాగా, వాటిలో 5 కళాశాలల్లో అడ్పిషన్లు కూడా జరుగుతున్నాయన్నారు. పులివెందుల, పాడేరు మెడికల్ కళాశాల పనులుకూడా పూర్తి కాగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం 2024-25 వాటిలో తరగతులు కూడా ప్రారంభం కావాల్సి ఉందన్నారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండే మెడికల్ కళాశాలలను ఎకరా రూ.100కే ప్రైవేటుకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని, అలా రెండు దశల్లో 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటికరించాలని నిర్ణయించారన్నారు. ఇదే జరిగితే 10 నూతన మెడికల్ కళాశాలలను అప్పనంగా తమ వారికి కట్టబెట్టేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పూర్తిగా రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే చాలని, ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయకుండా పీపీపీ పేరుతో ప్రైవేటీకరణపై ఏకపక్షం నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో గోవా, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు మెడికల్ కళాశాలల పీపీ విధానం గురించి ఆలోచన చేసినా తీవ్ర ప్రజావ్యతిరేకతతో ఆ పద్దతిపై వెనక్కు తగ్గాయని, ప్రస్తుతం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గేంత వరకు ప్రజలతో కలసి పోరాటాలు ముమ్మరంగా సాగిస్తామని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేపట్టందని, దీనికి గ్రామ స్థాయి నుంచి మండలస్థాయికి అనంతరం నియోజకవర్గ స్థాయికి, జిల్లాస్థాయికి తరువాత రాష్ట్రస్థాయికి కార్యక్రమాలను కొనసాగిస్తామని, దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, అన్ని మెడికల్ కళాశాలల పనులు పూర్తి చేసి పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు
