PS Telugu News
Epaper

ఎంపీ మిథున్‌రెడ్డి భూమి వివాదంపై స్పష్టం: 2000లో చట్టబద్ధం

📅 13 Nov 2025 ⏱️ 4:29 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :పవన్ కల్యాణ్‌కు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు? అంటూ  చేసిన ట్వీట్‌పై మిథన్‌రెడ్డి స్పందించారు. ఆరోపణలను నిరూపించాలని పవన్‌కు రీట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు. భూములను తాము 2000లోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులు తమ దగ్గరు ఉన్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చంటూ మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా భూములను పరిశీలించి, తర్వాత మాట్లాడాలని హితవు పలికారు. గతంలో ఎర్ర చందనం విషయంలో పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని గుర్తుచేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఉపమఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  సంచలన వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ ఏరియల్‌ సర్వే నిర్వహించిన సమయంలో వీడియోలు తీశారు. ఇవాళ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నివేదిక అందజేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. తూర్పు ఘాట్ పరిసరాల్లోని మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు.

Scroll to Top