వెంటనే మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బోటని లెక్చరర్ ను కేటాయించాలి

ఫ్యాకల్టీ లేకుండానే పోయిన సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు
ఈరోజుకి అదే స్థితి కొనసాగుతుండటంతో తీవ్ర ఆందోళనలో విద్యార్థులు
దళిత,బహుజన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరిక
డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రిజి.నం.717/1978 :
పయనించే సూర్యుడు జులై 30మక్తల్ :డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో నేడు మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన నాయకులు జూనియర్ కళాశాలలో గత 8 నెలలుగా బోటనీ ఫ్యాకల్టీ లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ దాదాపు 180కి పైగా ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారన్నారు.వాస్తవానికి పోయిన ఏడాది దసరా నుండే బోటనీ ఫ్యాకల్టీ లేదని అయిన సొంతంగా చదువుకొని పబ్లిక్ పరీక్షలు రాశామని ఇపుడు కనీసం ఈ 2026 విద్యా సంవత్సరం మొదలై 2 నెలలైనా నిమ్మకు నీరేత్తినట్లు ప్రభుత్వం,ఉన్నత విద్యాధికారులు ఫ్యాకల్టీనీ ఏర్పాటు చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు.ఇప్పటికే ఈ విషయమై డి.ఈ.ఓ కు కళాశాల ప్రిన్సిపల్ వసుంధర విజ్ఞప్తి చేసినా ఫ్యాకల్టీను కేటాయించకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ కళాశాలలో మెజార్టీగా చదువుకునే దళిత,బహుజన,పేద విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఉన్నత విద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి తగదని వెంటనే మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బోటనీ లెక్చరర్ ను కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయాలని లేనియెడల భవిష్యత్ కార్యచరణను ప్రకటించి ఉద్యమిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, సహాయ కార్యదర్శి రవికుమార్,క్రియాశీలక సభ్యులు తల్వార్ నరేష్,నాయకులు అక్షయ్ కుమార్,తరుణ్,కోరి పవన్ కుమార్, అనిల్, కోరి నవీన్, జగ్గలి వేణు తదితరులు పాల్గొన్నారు.