భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల ఇన్‌చార్జిగా గంధం పల్లంరాజు

July 30, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూలై 30 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)భోగాపురంలో ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణకు శ్రీకాకుళం టౌన్, రూరల్ ఇన్‌చార్జిగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజును పార్టీ నియమించింది.అనంతరం శ్రీకాకుళం టౌన్ ప్రాంతాలలో పర్యటించిన గంధం పల్లంరాజు నగర పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్‌ను కలిశారు. కార్యక్రమ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని గంధం పల్లంరాజు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper