PS Telugu News
Epaper

యువకుడిని నడిరోడ్డుపై చావకొట్టిన మహిళ.. ఎందుకో తెలుసా..! (వీడియో చూడండి)

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బాగా మితి మీరి పోతున్నాయి. బయటకి వెళితే ఎప్పుడు ఏమి జరుగుతుందో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో ఆకతాయిలు ఎక్కువై పోతున్నారు. మహిళలపై మృగాల లాగా ఎగబడుతున్నారు. చాలా దారుణంగా రేప్ లు చేస్తున్నారు. దారుణంగా అత్యాచారాలు చెయ్యడమే కాకుండా దారుణంగా చంపేస్తున్నారు కూడా. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. రోజుకో వార్త బయట పడుతుంది. ఇంకా బయటపడని దుర్ఘటనలు కూడా దేశం లో ఉన్నాయి. తాజాగా ఒక ఆకతాయి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని ఆమె తల్లి అతన్ని బజారులో కర్రతో కొట్టి మరీ బుద్ధి చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగింది. ఒక అమ్మాయిని ఒక ఆకతాయి బాగా ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆ అమ్మాయి తల్లి నడి బజారులో అతన్ని కర్రతో బాదేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ తల్లి అందరి ముందు అతన్ని కోపంతో కర్రతో బాదడం చూడవచ్చు. ఆ ఆకతాయిని మరో ఇద్దరు వ్యక్తులు పారిపోకుండా రెండు చేతులు పట్టుకోవడం మనం చూడవచ్చు. అతను ఆమె కొడుతుంటే బాధతో అరుస్తూ ఉన్నాడు. అయినా కాని ఆమె ఆగకుండా అతన్ని కొడుతూ తగిన బుద్ధి చెప్పింది. ఆమె కర్రతో అతన్ని కొడుతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న మరో వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా తెగ వైరల్ అవుతుంది. ఇక బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ తల్లి తన కూతురిని ఏడిపించిన అతన్ని కొడుతున్న తీరు చూసి శభాష్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇలాగే దేహ శుద్ధి జరగాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బుద్ధి చెబితే సమాజంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగవని అంటున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఈ వీడియోకి లైకులు కొడుతూ తెగషేర్ చేస్తున్నారు. ఈ వీడియో ఘర్ కే కాలేష్ అనే పీజీ ద్వారా ఎక్స్ లో పోస్ట్ చేయబడింది. ఇక తన కూతురుని ఏడిపించిన ఆ ఆకతాయికి బుద్ధి చెప్పిన ఆ తల్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Scroll to Top