గీతాంజలి దేవకుల్ పాఠశాలలో ఘనంగా “ఇంటర్ హౌస్ జూనియర్ న్యూస్ రూమ్” పోటీలు
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్లోని గీతాంజలి దేవకుల్ పాఠశాలలో ఇంటర్ హౌస్ జూనియర్ న్యూస్ రూమ్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడింది. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు నాలుగు హౌస్ల తరఫున పాల్గొని వార్తా వాచకం, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, వాతావరణం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అద్భుతంగా తమ ప్రతిభను కనబరిచారు.ఈ కార్యక్రమానికి 122వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ముఖ్య అతిథిగా విచ్చేసి, ది టైమ్స్ గ్రూప్లో ఎడిటర్ – ఇన్వెస్టిగేషన్స్గా సేవలందిస్తున్న సుధాకర్ రెడ్డి ఉడుముల తొ కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. విద్యార్థులు చిన్న వయస్సులోనే వార్తలను ధైర్యంగా, స్పష్టమైన ఉచ్చారణతో, ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాధవరం రోజా దేవి రంగారావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూని కేషన్ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందంను అభినందించి, పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపాల్ శ్రీలేఖ సురేష్ హెడ్మిస్ట్రెస్ వసంత మండలి సెంట్రల్ ఆఫీస్ అడ్వైజర్ అంజలి శర్మ ,ఉపాధ్యాయులు అవంతి హసీనా ప్రణీత, ఇర్ఫానా దివ్య శ్రీ, సీమ, యాస్మిన్, అంకిత, శ్రీలక్ష్మి పూర్ణకుమారి, విజయలక్ష్మి మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ప్రత్యేకంగా అభినందించారు.