గోదావరి ఒకటో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి గుత్తులు సాయి
పయనించే సూర్యుడు ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు, జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు, ఎన్డీయే కూటమి నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ. గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున తొలి హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉండి ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వరదలకు సంబంధించి ఎలాంటి సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08856 293104, అమలాపురం కంట్రోల్ రూమ్ 08856 233208, రామచంద్రపురం కంట్రోల్ రూమ్ 08857 245166, కొత్తపేట కంట్రోల్ రూమ్ 85002 38258, 08855 244299.