అశ్వాపురం గ్రామ పంచాయతీ లో మహిళా గ్రామ సభ*
పయనించే సూర్యుడు, ఆగస్ట్ 03,అశ్వాపురం: సోమవారం నాడు, అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో, సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన ప్రత్యేక మహిళా గ్రామ సభను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ యొక్క మహిళా సభను ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, ఆరోగ్యం, విద్య, ఉపాధి, మహిళల భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, జీవనోపాధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.మహిళల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తీర్మానించారు. గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని, ప్రతి మహిళ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సభలో అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధి కోసం మహిళల సూచనలు, అభిప్రాయాలను గ్రామసభలో ప్రతిపాదించాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిదంగా వార్డు సభ్యలు చంద్రకళ మరియు వేములపల్లి హసిత ఈ సభను ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగినది అదేవిధంగా సర్పంచ్ ఈ గ్రామ సభలో స్వీకరించిన సమస్యలను రాబోవు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామ సభలో ప్రాధాన్యతగా వీటి పై చర్చించి ఆమోదిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మహిళా సభలో ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు, వార్డు సభ్యులు శ్రీమతి చెట్టుపల్లి రమాదేవి, చింతల అనుపమ, పాయం నాగేంద్ర బాబు, చిక్కా పద్మ మరియు డ్వాక్రా మహిళా సంఘాలు, అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్లు మహిళలు,గ్రామ పెద్దలు మరియు,పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.