ఓటు బ్యాంకు రాజకీయాలు మాని..ప్రజలకు మేలు చేయడం ముఖ్యం.

August 3, 2026 | తెలంగాణ

డంపింగ్ యార్డు విషయంలో నిర్లక్ష్యం ఎందుకు?

రాజకీయం కోసమే ధర్నాలు చేస్తున్నారా!

సిద్దాపూర్ డంపింగ్ యార్డు పై బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప ఆగ్రహం.

( పయనించే సూర్యుడు ఆగస్టు 04 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )సిద్దాపూర్ డంపింగ్ యార్డు పై ధర్నాలు,నిరసనలు చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా నేటికి పూర్తి స్థాయిలో ఫలితం రావడం లేదని,ఇది కొందరు వ్యక్తుల కోసమా లేక రాజకీయం కోసమా అంటూ ప్రశ్నిస్తున్నారు బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప…గత రెండు నెలల నుంచి సిద్దాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డు వద్దంటూ అటు గ్రామస్తులు,యువత, ఇటు ప్రజా సంఘాలు నిరసనలు,ధర్నాలు చేపట్టడం బాగానే ఉన్నా నేటికి ఎలాంటి చర్యలు పూర్తి స్థాయిలో ఫలితాలు రాలేదని అన్నారు.పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు.కొందరు చేస్తున్న రాజకీయం ప్రజలైతే గమనిస్తున్నారన్నారు. ఎవరు ఎలా చేస్తున్నారో నియోజకవర్గం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.మీ రాజకీయం కోసం ఎత్తుగడలు మానాలని సూచించారు.ఇదంతా కొందరు రాజకీయ శక్తులు వారి స్వలాభం కోసమే చేసినట్లు కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.డంపింగ్ యార్డు విషయంలో పాక్షిక నిర్ణయాలు కాదు…ఎప్పటికి ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా ఓటు బ్యాంకు రాజకీయాలు మాని ప్రజల ఇబ్బందులు గుర్తించి,డంపింగ్ యార్డు విషయంలో నిజాయితీగా ప్రజలకు మేలు కలిగేలా కృషి చేయాలని కోరుతున్నారు.రాజకీయఓటు బ్యాంకు కావాలంటే ప్రజలకు మేలు చేయడం ముఖ్యమని,ఇది గమనించి ఇప్పటికైనా ముందుకు వచ్చి పరిష్కారం దిశగా వెళ్తారని సూచించారు…

🌐 Select Language:
📰 ePaper