ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శిస్తాను అంటే కుదరదు ఎమ్మెల్యేగా కనీస బాధ్యత తీసుకోవాలి.. అహంకారాన్ని వీడి ప్రజలు గెలిపించినందుకు కనీస సేవ చేయాలి..
పయనించే సూర్యుడుD.4.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.— బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ఈరోజు మంగళవారం రోజున మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల సముదాయాన్ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. 2017 మే నెలలో నిర్మాణం ప్రారంభించి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మంత్రిగా కొనసాగిన ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించ లేకపోయారని రెండు పడక గదుల సముదాయానికి కనీసం రోడ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని అన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించే పని తప్పా ఆయనకు మరే పని గుర్తుకురావడం లేదని అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కనీసం బాధ్యతతో వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు తెలపాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున నేను బాధ్యతగా ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాల కొరకు MRO లతో సమావేశం ఏర్పాటు చేస్తే ఎమ్మార్వోలపై జిల్లా కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా ప్రశాంత్ రెడ్డి పిర్యాదు చేశారని ఆయన పని చెయ్యరు పని చేసేవారిని చేయనియరు అని అన్నారు. ప్రభుత్వంను పనులు అడిగే క్రమంలో ప్రశాంత్ రెడ్డి పిలిస్తే ప్రజల కోసం ఎటువంటి భేషజాలు లేకుండా ఆయనకు పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.కార్యక్రమంలో ఉమ్మడి బాల్కొండ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచ్ లు,కార్యకర్తలు పాల్గొన్నారు