పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంతో శ్రేష్టం*
పయనించే సూర్యుడు D.5.8.2026. నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గం ఎర్రగట్ల మండల కేంద్రంలో.. మండల ఐసిడీస్ సూపర్వైజర్ గంగ హంస.ఎర్గట్ల మండలం మండల కేంద్రం లో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం రోజున అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమని, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు అత్యంత కీలకమని తెలిపారు.ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగ హంస మాట్లాడుతూ, ముర్రుపాలు శిశువుకు జీవితాంతం వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయని, ఆరు నెలల అనంతరం అనుబంధ పోషకాహారం ప్రారంభించాలని సూచించారు. ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తు కొలిచి వారి పోషకాహార స్థితిని పర్యవేక్షించాలని లబ్ధిదారులకు సూచించారు.అంగన్వాడీ టీచర్లు గర్భిణులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ప్రతిరోజూ అందించే సంపూర్ణ భోజనాన్ని వినియోగించుకోవాలని, ప్రతి నెల పిల్లల బరువు తప్పనిసరిగా తూకం వేయించుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పిల్లలకు నిర్ణీత సమయానికి అన్ని టీకాలు వేయించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు, సూపర్వైజర్ మరియు అంగన్వాడి టీచర్లు , చంద్ర కళ, శోభ, సుజాత, భవిత ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
