PS Telugu News
Epaper

పలు గ్రామాలలో రీ సర్వే.

📅 30 Dec 2025 ⏱️ 7:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

భూ సమస్యల శాశ్వత పరిస్కారముఒ కొరకు రీ సర్వే ప్రాజెక్ట్ కార్యక్రమములో భాగంగా యాడికి మండలం, నిట్టూరు ,గుడిపాడు గ్రామము నందు రీ-సర్వే పనులు ప్రారంభించబడం జరిగినది. ఇంధులో భాగముగా తేది: 30.12.2025వ తేదిన సమయం ఉదయం 10:30 గుడిపాడు గ్రామం నందు మరియు మధ్యాహ్నం 03:00 గంటలకు నిట్టూరు గ్రామము నందు ర్యాలీ నిర్వహించి సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించబడినది అని తెలియజేయడమైనదియాడికి మండలము, గుడిపాడు,నిట్టూరు గ్రామ పొలం రైతులు, ప్రజలు ఈ యొక్క అవకాశమును ఉపయోగించుకొనుటకు గాను మీరు మీ గ్రామమునంధు అంధుబాటులోవుండి మీ యొక్క భూ సమస్యలను పరిస్కరించుకోవలసింధిగా మరియు మీ యొక్క భూములను కొలిచి రికార్డు చేయడానికి మేము తెలిపిన తేదిమరియు సమయానికి మీ యొక్కభూమిపైకి సర్వే కు హాజరుకావాలని యాడికి తహశీల్దార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి,ఆర్.యస్.డి.టి విజయ్,మండల సర్వేయర్ శేషసాయి మరియువి.ఆర్ వోలు, గ్రామ సర్వేయరులు,గ్రామ నాయకులు, సచివాలయసిబ్బంది మరియుగ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top