మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాట్లాడిన ఉపేక్షించేది లేదు సూళ్లూరుపేట సిఐ

August 6, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు ఆగస్ట్ 6 (సూళ్లూరు పేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట, తడ ప్రాంతాల్లో మహిళలు, మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడినా, ఆకతాయి పనులు చేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ తీవ్రంగా హెచ్చరించారు. ఈవ్‌టీజింగ్, మహిళలకు ఇబ్బందులు కలిగించడం లేదా బైక్‌లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భయాందోళనలు సృష్టిస్తే చట్టరీత్యా ఊచలు లెక్కించక తప్పదని సీఐ స్పష్టం చేశారు.​శ్రీసిటీ, మాంబట్టు వంటి ప్రముఖ పారిశ్రామిక వాడల్లో ఉద్యోగాలు చేస్తూ వేలాది మంది మహిళలు సూళ్లూరుపేట, తడ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. పి.జి. హాస్టళ్లు, మహిళలు నివసించే పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, సీఐ ఎం. మురళీకృష్ణ తెలిపారు.మహిళలను గౌరవించడం మన సనాతన ధర్మం, మన తల్లిదండ్రులు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ స్థానికులు, ఉద్యోగులు ఆనందంగా జీవించాలి తప్ప, చెడు తిరుగుళ్లు తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని సీఐ మురళీకృష్ణ తేల్చి చెప్పారు.​పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, రహదారులపై ప్రైవేటు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకూడదని సీఐ హెచ్చరించారు​మన ప్రాంతంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంతో పాటు, ప్రపంచంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఉంది. నిత్యం దేశవిదేశాల నుంచి ఎంతో మంది భక్తులు, శాస్త్రవేత్తలు, సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. మన ప్రవర్తన వల్ల ఈ పుణ్యభూమికి, శాస్త్ర రంగానికి పేరుగాంచిన ప్రాంతానికి చెడ్డపేరు రాకూడదుఎం. మురళీకృష్ణ,సూళ్ళూరుపేట సీఐ​మహిళలు, విద్యార్థినులు, సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ పిలుపునిచ్చారు.అత్యవసర పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లు సమస్యలు ఎదురైతే ప్రజలు నేరుగా కింది అధికారుల ఫోన్ నంబర్లకు సమాచారం అందించ వచ్చు సూళ్ళూరుపేట సీఐ 9440796360,సూళ్ళూరుపేటఎస్సై 9440796361,తడ ఎస్సై 9440796362,శ్రీహరికోట ఎస్సై 9440796363 ​సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సీఐ ఎం. మురళీకృష్ణ హామీ ఇచ్చారు.

🌐 Select Language:
📰 ePaper