సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వండి : శ్రీ బండి రమేష్

August 6, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్ట్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యలు,అభివృద్ధి పనులపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ని కలిసి వినతిపత్రం అందించిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్,టపిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్ చాలాకాలంగా మూసాపేట్ వై జంక్షన్ ఫ్లైఓవర్ సమస్యలున్నాయని,మూసాపేట్ రోడ్ వైండింగ్,లేక్ వ్యూ,బాలానగర్ నాలాలు,సిల్ట్ పనులు పెండింగ్ లో ఉన్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు,చాలా కాలనీల్లో రోడ్లు పాడైపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం పరిశీలనలో తేలిందని, పార్కుల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టి తగిన నిధులు మంజూరు చేసి,పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రమేష్ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ సృజన వీలైనంత త్వరలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

🌐 Select Language:
📰 ePaper