పి.గన్నవరంలో బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం

May 15, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు మే 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్‌కు కార్యకర్తలు సిద్ధం కావాలి: జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా పిలుపు భారతీయ జనతా పార్టీ పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం స్థానిక శ్రీ భీమాల వెంకటేశ్వరరావు కాంప్లెక్స్‌లో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ చీకరమెల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 23, 24 తేదీల్లో భట్లపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్-2026’ శిక్షణా శిబిరానికి పార్టీ నిర్దేశించిన ఆపేక్షితులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి ప్రశిక్షణలో వక్తలు అందించే సమాచారాన్ని క్షుణ్ణంగా విని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కటికిరెడ్డి తమ్మయ్య నాయుడు, సీనియర్ నాయకులు చెరుకూరి గోపాలకృష్ణ, పి.గన్నవరం మండల అధ్యక్షులు తిక్క సత్యనారాయణ, అంబాజీపేట మండల అధ్యక్షులు కురస ఆంజనేయులు, అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మామిడికుదురు మండల అధ్యక్షులు బైరిశెట్టి దుర్గా రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు షంసు సాదిక్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు, జిల్లా కార్యదర్శి దంతులూరి రామా వర్మ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విల్ల దొరబాబు, జిల్లా ఆఫీస్ ఇంచార్జ్ డివిఎస్ రాజు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మేడిది సత్యనారాయణ, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు దిగుమతి ఏడుకొండలు, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పన్న గణపతరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు యర్రంశెట్టి సాయిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు తోలేటి సుబ్బారావు, జిల్లా మాజీ కార్యదర్శి అడ్డాల వెంకటేశ్వరరావు, జిల్లా మాజీ బిల్డింగ్ వర్కర్ సెల్ కన్వీనర్ రంగసాయి, మాజీ మండల అధ్యక్షులు కముజు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కోటే శివాజీ, మండల ఉపాధ్యక్షులు కోలగోపాలకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్, కొండా రామారావు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper