చిన్న కొత్తలంక గ్రామదేవత సత్తెమ్మ తల్లికి ఆషాఢం సారె
ప యనించు సూర్యుడు ఆగస్టు 8 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో వేంచేసియున్న శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారికి గ్రామస్తులు మాతృమూర్తులు మూర్తి రాజు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆషాడం సారే తీసుకొని నగర సంకీర్తనగా మేళ తాళాలతో అమ్మ నామాన్ని స్మరిస్తూ అమ్మవారి ఆలయం చేరుకుని సారె సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ వికాస్ కార్యకర్త బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మన ఇంటి ఆడపడుచుకు సారె పెడితే ఆనందించిన విధంగానే గ్రామదేవత కూడా ఆనందంచెంది మనందరినీ ఆశీర్వదిస్తుంది గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుతుంది ఏ విధమైన అంటు వ్యాధులు విష జ్వరాలు దుష్ట శక్తులు దరిచేరకుండా కాపాడుతుంది అన్నారు.ధర్మ ప్రచారకులు బి కనకారావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా హిందూ సంఘటన జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాతృమూర్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.