కొత్తగ చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లుకు మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొరకు గ్రామపంచాయతీ మరియు మండల ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలి. .
పయనించే సూర్యుడుD.8.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్..- ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్..ఈరోజు శనివారం రోజున మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేయదలచిన వితంతు, వికలాంగ, ఒంటరి మహిళలు,గీత కార్మికులు తలసేమియా బాధితులు, డయాలసిస్ రోగులకు ఇవ్వదలుచుకున్న నూతన పెన్షన్ కొరకు గ్రామపంచాయతీ కార్యాలయాలు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మీ సేవలో అప్లికేషన్ పారంలు లభించును. ఏమైనా డౌట్స్ యున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి అడగాలని, గత BRS ప్రభుత్వంలో చూపినట్లు వివక్ష చూపకుండా రూపాయి ఖర్చు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి అన్నారు.ఇప్పటికే ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులను మంజూరు చేసిందని ఇంకా అవసరమైన పేదలందరూ రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఆగస్ట్ 15 నుండి రేషన్ కార్డ్ ఫ్యామిలీ గుర్తింపు స్మార్ట్ కార్డులు ప్రభుత్వం జారీ చేస్తుందని అన్నారు.పెన్షన్ల జారీ ప్రక్రియకు చివరి తేదీ ఏమీ నిర్ణయించలేదని పెన్షన్ల జారీ ప్రక్రియకుల నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.వృద్ధాప్య మరియు బీడీ కార్మిక పింఛన్ రెండో విడతలో మళ్లీ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని మొదటి విడత జాబితాలోని వారు కావలసిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారునూతనంగా రేషన్ కార్డులు మంజూరైన వారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మండల ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారుప్రభుత్వం నాణ్యమైన, పోషకాలు కలిగిన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని అన్నారురాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలు మరియు పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారని ప్రభుత్వం మహిళా పేద పక్షపాతి కలిగిన ప్రభుత్వం అని అన్నారు.ఇప్పటికే మండలంలో 500 కు పైగా ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ మంజూరు చేసిందని మరో 500 ఇండ్లు మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని అడిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. BRS ప్రభుత్వం యున్నప్పుడు 10 ఏండ్లు పాలన కొనసాగించి 7 లక్షల కోట్ల అప్పు చేసి జేబులు రింపుకున్నారు కానీ పేదల సంక్షేమం ఇండ్లు, బియ్యం కార్డులు, పింఛన్లు ప్లాట్ల పంపిణీ గురించి పట్టించుకోలేదని ఇవ్వలేదని మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సోమా దేవరెడ్డి అన్నారు.గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని కానీ రేవంత్ సర్కార్ మాత్రం పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు మరియు ప్లాట్లు ఇచ్చిన కాలనీ లు యున్నవి కానీ BRS లో ఇచ్చిన డబల్ బెడ్ రూంలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఏర్గట్ల మండల కేంద్రములో 300 మందికి ఇండ్లు అవసరం యుంటే అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మన ఎమ్మెల్యే యుండి కూడా 10 ఏండ్లకు కలిపి లేక లేక ఇచ్చిన 42 డబల్ బెడ్ రూముల ఇచ్చినా కానీ అసంపూర్తిగా, నాణ్యత లోపం యుండటం వల్ల అర్హత యున్న లబ్ధిదారులకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అన్ని ఆలోచించి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు. ఇచ్చినకా భవిష్యత్ లో లబ్ధిదారులకు సమస్యలు రాకుండా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే నిజమైన అర్హత యున్నవారిని ఎలాంటి వివక్ష లేకుండా లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారని వాటిని కూడా త్వరలో అధికారులు కేటాయిస్తారు అని శివకుమార్ తెలిపారు. ఇట్టి ప్రెస్ మీట్ లో సోమ దేవరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు