ఆగస్టు 10 న జరిగే “జైలు భరో ”కార్యక్రమమును జయప్రదం చేయండి.

August 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.8.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ పిలుపు .బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం పిలుపులో భాగంగా ఆగస్టు 10న “జైలు భరో” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబందా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రారంభించిన సందర్భంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ….ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని సంపదను సార్వభౌమత్వాన్ని విదేశీ సంస్థలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆయన దుయ్యబట్టారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన ట్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాతంత్ర వాదులు పోరాడాలని క్విట్ ఇండియా స్ఫూర్తితో 2026 ఆగస్టు పదిన జరిగే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఇటీవల అమెరికా బ్రిటన్ న్యూజిలాండ్ యూరోపియన్ యూనియన్ 32 దేశాలతో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిత్స ఒప్పందాల్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతుల సుంకాన్ని పూర్తిగా తగ్గించడం వల్ల దేశంలో ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయలను నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగాబి దేవారం (ఏఐయుకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ) మాట్లాడుతూ..అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మికులకు కార్మిక చట్టాలను ఒక్క కలం తోనే 29 చట్టాలను రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు కోడ్స్ గా తీసుకురావడం అంటే కార్మికులు వారి మౌలిక హక్కులను పూర్తిగా హరించడమే అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు సంఘటిత అసంఘటిత కార్మికులకు నష్టం వాటి విధానాలని అవలంబిస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు ప్రజలు పెద్ద ఎత్తున బిజెపి పాలనకు చరమగీతం పాడితే తప్ప ఈ విధానాలను తిప్పి కొట్టలేమని అందుకు ఆగస్టు పదిన జరిగే జైలు మరో కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని వారుపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోటి యు సి ఐ జిల్లా ఎం.ముత్తెన్న, ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు సురేష్ , ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్, ఏఐయుకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ యు.రాజన్న, టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్య,, టి యు సి ఐ సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు పి. ప్రకాష్ , జిల్లా కోశాధికారి G. అరవింద్ , పిడిఎస్యు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ , ఏరియా అధ్యక్షులు డి.నిఖిల్, ప్రధాన కార్యదర్శి రాజు , నాయకులు వినోద్ , వచన, రాజేష్ , మంగళదీప్ , ధనుంజయ్ , నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper