ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి ని పరామర్శించిన షాద్ నగర్ జేఏసీ నాయకులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జాతీయ నాయకులు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి సతీమణి కత్తి భవాని ఇటీవల మరణించిన సందర్భంగా హైదరాబాదులోని వారి నివాసంలో కలిసి పరామర్శించడం జరిగింది.ఈ దుఃఖ సమయంలో భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించాలని ప్రార్థించారు.ఇట్టి కార్యక్రమంలో టిఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్,జేఏసీ చైర్మన్ మూలే జనార్ధన్, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ,కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్ తదితరులు పాల్గొని దివంగత కత్తి భవానికి నివాళులర్పించారు.