ఆపదలో ఉన్న పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

August 8, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు ఆగస్టు 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)పేద ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన 50 మంది లబ్ధిదారులకు మొత్తం 30,79,864 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి సుభాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఖరీదైన వైద్య చికిత్సల కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకం చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అందిన ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని వారు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, రూరల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, గంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, కాజులూరు మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, స్వచ్చా ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, వి.వి.ఎస్.ఎన్. చౌదరి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper