క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు అందించాలి: బండి రమేష్

August 9, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం అత్యంత కీలక ఘట్టమని, ఆ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టిపిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్ అన్నారు.క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ నాయకత్వంలో సాగిన క్విట్ ఇండియా ఉద్యమం దేశ ప్రజల్లో ఐక్యత, దేశభక్తి, త్యాగస్ఫూర్తిని నింపిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాల స్ఫూర్తితో దేశ అభివృద్ధి, ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధారి ప్రభాకర్ యానాల ప్రభాకర్ రెడ్డి సాంబశివరావు నాగేశ్వరరావు మదన్మోహన్ సునీత గారితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper