PS Telugu News
Epaper

నాలుగు లేబర్ కోడ్లు_రద్దు చేయాలి .

📅 12 Feb 2026 ⏱️ 6:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రభుత్వరంగసంస్థలప్రైవేటీకరణనుఆపాలి .

TUCI జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13మక్తల్

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది. దీనిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని టి యు సి ఐ జిల్లా ఎస్ కిరణ్ అన్నారు.ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా మక్తల్ లో టి యు సి ఐ ఆధ్వర్యంలో కిరాణం మర్చంట్ భవనంలో సార్వత్రిక సమ్మె సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొలిమి రాములు టియుసిఐ జిల్లా నాయకుల అధ్యక్షత వహించగా వక్తలు గా టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్, కే ఎన్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ చంద్రశేఖర్ , ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు భగవంతు లు ప్రసంగిస్తూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోసం రద్దు చేయాలని అన్నారు , కనీస వేతనం 26 వేలు, నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని అన్నారు. ప్రభుత్వాలు లేబర్ కోడ్ ని ఆమాలు చేస్తామని బాటంగా ప్రకటించి అమలు పూలుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని 10 గంటల పని దినంగా మార్చింది. రాత్రి షిఫ్టులో మహిళలు పనిచేయాలని నిర్ణయించింది, దేశంలో అనేక రాష్ట్రాల్లో నాలుగు లేబర్ కూడా సాగుతో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ కఠినంతన చేశారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించిన కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి కార్మికుల ఐక్యంగా ఉద్యమం చేయాలని వారు పిలుపును వ్వడం జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉంటే కుటుంబాలు గడవడం గడ్డు పరిస్థితిగా ఉంది. వర్షాకాలం సీజన్ కాబట్టి గ్రామపంచాయతీ కార్మికులు లేకుంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండవు ప్రజలు అనారోగ్యాలతో తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆరోపించారు. కావున గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున అందోళన చేస్తామని అధికారులకు తెలియజేస్తున్నాం .ఈ సమావేశంలో టియుసిఐ పద్మక్క, నరేష్ , నరసింహ, వెంకటయ్య , సువన్న, జి క్రిష్ణయ్య, బండారి మల్లేష్, నరేందర్, రాయకూడ అంజి, బండారి బాలు, జగ్గలి బాబు, అంజన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top