విద్యుత్ షాక్ గురై మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఆపదలో ఉన్న వారిని చేయూతగా భోస్లే మోహన్ రావ్ పటేల్ స్థానిక ముధోల్ మండల కేంద్రానికి చెందిన ముద్గుల సాయినాథ్ అనే వ్యక్తి ఇటీవల కరెంట్ షాక్ కి గురి అవ్వడం వల్ల అక్కడికక్కడే మరణించడం జరిగింది,ఈ విషయం గ్రామస్థుల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ ఈ రోజు ముధోల్ మండల కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు,వారి కుటుంబానికి తన వంతుగా సహాయం చేయాలనే ఉధ్యేశ్యంతో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా వారి భార్య ముద్గుల అంజలి కి 10000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కు రూపంలో గ్రామస్థుల సమక్షంలో అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హిజదొద్దీన్ మాజీ ఎంపీపి సుభాష్ జాదవ్ ,వార్డు మెంబర్ పోతన్న ,ధర్మపురి సుదర్శన్ టీచర్ ,మండల నాయకులు మరియు బిజెపి సీనియర్ నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.