CEIR పోర్టల్ ద్వారా 8 సెల్ ఫోన్లు రికవరీ చేసి యజమానులకు అందచేత.
పయనించే సూర్యుడుD.11.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. భీమ్గల్ మండల పరిధిలో గత కొన్ని రోజులుగా మొబైల్ ఫోన్ లు పోగొట్టుకున్న ఫిర్యాదులను CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి, 8 సెల్ ఫోన్లు రికవరీ చేసి యజమానులకు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ ఎవరైనా పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసినచో త్వరితగతిన ఫొన్ లను ట్రేస్ చేసే అవకాశం కలదు. ఇట్టి ఫోన్ లను రికవరీ చేసినందున T. నారాయణ కానిస్టేబుల్ ను అభినందించనైనది.