దేవునిబండ తండా విద్యార్థులకు షూస్ పంపిణీ *
విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన సర్పంచ్ మూడవత్ శ్రీను మరియు ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్
ఫరూఖ్ నగర్ మండలం దేవుని బండ తాండ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
( పయనించే సూర్యుడు ఆగస్టు 13 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్ నగర్: ఫరూఖ్ నగర్ మండలం దేవుని బండ తాండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మూడవత్ శ్రీను మరియు ఉప సర్పంచ్ బాధవత్ శ్యామ్ లాల్ షూస్ పంపిణీ చేశారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షూస్ అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద పీఠం వేస్తారని తెలిపారు. విద్యార్థులు,ఉపాధ్యాయులు సర్పంచ్ శ్రీను కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ భాస్కర్ .సెక్రటరీ గీత . పాఠశాల ఉపాధ్యాయులు.ఉప సర్పంచ్ శ్యామ్ లాల్, వాడు సభ్యులు P. జానూ, విద్యార్థులు. గ్రామ పెద్దలూ బాదావత్ శంకర్, మూడవత్ జ్యోతి మరియు యూవకులు పాల్గొన్నారు.