వరి కొనుగోలు కేంద్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన బిజెపి పోరుబాట
పయనించే సూర్యుడు నిజామాబాద్ స్టాపర్ టీ కే గంగాధర్బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంశనివారం రోజు మాజీ వైస్ ఎంపీపీ ప్రస్తుత గ్రామ ఉపసర్పంచ్ నాథీ మోహన్ గౌడ్ మరియు కుప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్ మరియు స్థానిక మండల నాయకులతో కలిసి భీంగల్ మండలం చెంగల్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీజేపీ భీంగల్ మండల అధ్యక్షులు ఆరె రవీందర్,బిజెపి భీంగల్ మండల అధ్యక్షులు అరే రవీందర్ మాట్లాడుతూ కోతలు ముగించుకొని రెండు నెలలు గడుస్తున్న భీంగల్ మండలంలో కల్లాలలో వడ్లు కుప్పల్ కుప్పలుగా ఉన్నాయి మరీ ముఖ్యంగా చేంగల్ గ్రామంలో అయితే రైతులు పంటను తెచ్చి రెండు నెలలు గడిచిన సుమారు 60 లారీల వడ్లు కల్లాల మీదనే ఉన్నాయి, ఎక్కడికక్కడ పత్రాలు కప్పి కుప్పలు తెప్పలుగా వున్నాయి రాష్ట్ర ప్రభుత్వంకు రైతుల ఆవేదన చీమకుట్టినట్లు కూడా లేదు మీడియా లో హైప్ కోసం నిన్న బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు గారు వచ్చి చూసి వెళ్లారు కానీ ఎక్కడి వడ్లు అక్కడే వున్నాయి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని మాట చెబుతున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వ తీరును రైతుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం,రైతులను వివరాలు అడిగి తెలుసుకోగా ఒక్క క్వింటాలుకు 8 కిలోల కడుతా కటింగ్ చేస్తున్నారు మరియు లారీల కోసం ఒక్క 40 కిలోల బస్తాకు 4 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అధికారులు పట్టించుకోవడం లేదు,వరి కొనుగోలు కేంద్రాలు కేవలం నిర్వహించడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రతి గింజను నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా చెల్లింపులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏమిటో అర్థం అవడం లేదు ఎందుకంటే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాంటిది డబ్బులు కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ఇవ్వంగా ఖాళీ ఒక మధ్యవర్తి లెక్క ఏజెన్సీ లెక్క ఉండి వడ్ల సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే విధానంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే రైతుల తరఫున ఈమాత్రం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునే నాయకులు సిగ్గుపడాల్సి ఉంటుంది,రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతాంగం తరపున బిజెపి తీవ్రంగా హెచ్చరిస్తుంది ఇలాంటి పరిస్థితులే కొనసాగుతా ఉంటే ప్రజలు మీకు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో కుప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు,చెంగల్ గ్రామ ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్,bjym మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్ చంద్,సీనియర్ నాయకులు కొట్టాల అశోక్,పురస్తూ దినేష్, బాలయ్య, శ్రీనివాస్,మరియు చెంగల్ గ్రామ రైతులు పాల్గొన్నారు..