PS Telugu News
Epaper

సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లోలో భారీగ గంజాయి పట్టివేత

📅 07 Mar 2026 ⏱️ 5:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్‌ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ పరిధిలో RPF ఎన్నికల ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించగా రైలులో భారీగా గంజాయి పట్టుబడింది.ట్రైన్ నం.13351 (ధన్‌బాద్–అల్లప్పుజా ఎక్స్‌ప్రెస్) రైలులోని జనరల్ బోగీలో అనాథగా ఉన్న బ్యాగులను పరిశీలించగా గంజాయి బండిళ్లు బయటపడ్డాయి.మొత్తం 16 బండిళ్లలో సుమారు 18 కిలోల గంజాయి లభించగా, దీని విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

Scroll to Top