నల్లమిల్లి మూలారెడ్డి జయంతి సందర్భంగా వృద్ధునికి వస్త్రాల పంపిణీ
పయనించే సూర్యుడు మే 8 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ * 8-5-2026 భారతీయ జనతా పార్టీ కాజులూరు మండల శాఖ స్వర్గీయ నల్లమిల్లి మూలా రెడ్డి జయంతి సందర్భంగా పల్లిపాలెం గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి సేవా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మండల బిజెపి అధ్యక్షులు పుణ్యవంతులు శివాజీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిలుగా పల్లెపాలెం గ్రామ టిడిపి అధ్యక్షులు బి ఆదినారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు రవికలు, పురుషులకు పంచెలు కండువాలు వితరణ చేశారు, సేవ ద్వారా ప్రతి కార్యకర్త ప్రజలకి చేరువై తమ తమ పార్టీల్ని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా కూటమి నాయకులు అభిప్రాయపడ్డారు, ముఖ్య అతిథి సలాది వీరబాబు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడమే పరమార్ధంగా భావించాలని రాజకీయ నాయకులకు కొత్త భాష్యం తెలిపిన మా స్థానిక శాసనసభ్యులు కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ప్రేరణ వల్లే ఇలాంటి సేవా కార్యక్రమంలో నిమగ్ననమవుతున్నామని అన్నారు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మూలారెడ్డి వారి నియోజకవర్గంలో ప్రజలకు అనేక సేవలను అందించారని, అలాంటి వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ,, సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు, ప్రజలకు సేవ చేయడానికే రామచంద్రపురం నియోజవర్గంలో కూటమి నాయకులందరూ పనిచేస్తున్నారని ప్రజలకు వివరించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాయపు రెడ్డి భైరవమూర్తి, సొసైటీ డైరెక్టర్ కోటి నాగేశ్వరరావు, తాతపూడి గోపాలరావు, కాలా నరసింహమూర్తి, కాదా బుజ్జి, మండల ప్రధాన కార్యదర్శిలు నిమ్మన రాజేష్, వాసంశెట్టి రామకృష్ణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు జక్కా శ్రీనివాసరావు అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు