ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై అవగాహన

May 18, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు మే 17 (సూళ్లూరు పేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో ఎ.పి.శాక్స్ వారి సలహాతో తిరుపతి జిల్లా దిశా వారి సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సి.సి- పి.యు ప్రాజెక్టు నాయుడుపేట వారు ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా నవజీవన్- సి.సి- పి.యు ఆఫీస్ నుండి ఓల్డ్ మండలం రెవెన్యూ ఆఫీస్ వరకు సంస్థ సిబ్బంది వారిచే కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హెచ్.ఐ.వి వ్యతిరేక నినాదాలతో సాగింది. అనంతరం ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా, హెచ్.ఐ.వి బాధితులకు‌ సంఘీభావం తెలిపేందుకు మరియు హెచ్.ఐ.వి తో మరణించినవారికి వారి యొక్క ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఇదే విధంగా సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వెంకటగిరి ఏరియాలలో కూడా అక్కడ పని చేస్తున్న సిబ్బంది వారిచే హెచ్.ఐ.వి బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఈ క్యాండిల్ లైట్ డే కార్యక్రమంను నిర్వహించడం జరిగింది అని, ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా సుమారు 400 మంది పట్టణ ప్రజలు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన పొందారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది అయిన కె. బాలాజి, కవిత, శ్రీలత, మంజుల, శ్రావణి, నందిని, సాయి లక్ష్మి, ఐశ్వర్య, ముని కుమారి మరియు పి.ఇ లు అయిన ఆదిలక్ష్మి, భారతి, అప్సాన, మహేశ్వరి, ఇతర మహిళలలు మరియు పట్టణ ప్రజలు 400 మంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper