ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని.CITU డిమాండ్

May 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు మే 19మక్తల్ :ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు గౌరమ్మ, గోవిందమ్మ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మక్తల్ శాసనసభ్యులు మరియు మంత్రి. డాక్టర్ వాకిటి శ్రీహరి.నివాసం దగ్గర పిఏ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ప్రతినెల 1వ తారీఖున పరితోషకాలు వేయాలని ఆశలకు ఉద్యోగ భద్రత పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ప్రమాద బీమా 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, దాన సంస్కరణాల మట్టి ఖర్చులు 50 వేలు ఇవ్వాలని పెండింగ్లా ఉన్నటువంటి లిప్రాసి మూడు సంవత్సరాల బిల్లులు వెంటనే ఇవ్వాలని ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పిస్తామని తదితర అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నెల సక్రమంగా వేతనాలు కూడా ఇవ్వకుండా ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయంగా రావలసిన హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసుల ద్వారా నిర్బంధాలు ప్రయోగించి ఆశా వర్కర్ల ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో జాబ్ చాట్ లో లేని అనేక రకాల పనులను చేయిస్తూ అదన పనిభారాలను మోపుతూ ఆశ వర్కర్ల అనారోగ్య లకు కారణమవుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు గౌరమ్మ, గోవిందమ్మ, పద్మ, యశోద, ఇందిరా, సుజాత, శివలింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper