భైంసా పట్టణంలోని డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ శ్రీమతి కె. దివ్యకు ఉత్తమ లెక్చరర్ అవార్డు

August 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి కె. దివ్యకు ఉత్తమ లెక్చరర్ అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మరియు చీఫ్ విప్ వేముల వీరేశం చేతుల మీదుగా ఆమె ఈ ఉత్తమ లెక్చరర్ ప్రశంసా పురస్కారాన్ని అందుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు, కళాశాల అభివృద్ధి మరియు విద్యార్థుల ప్రగతికి ఆమె అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బెస్ట్ లెక్చరర్ అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. భీమా రావు, వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్, కోఆర్డినేటర్ డా. రవి కుమార్, సీనియర్ అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. ఎం. శంకర్, రాజు, ఆర్.ఈ., డా. ఓం ప్రకాశ్, డా. కల్పన, డా. నహీదా, రాజయ్య, సురేందర్ తదితర అధ్యాపకులు శ్రీమతి కె. దివ్యను అభినందించారు.ఈ ఉత్తమ లెక్చరర్ అవార్డు ఆమె విద్యా సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో విద్యార్థుల అభ్యున్నతికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper