ఘనంగా సుభాష్ చంద్రబోస్ వర్ధంతి

August 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 19/08/26 జాతీయ బీసీ సంక్షేమ సంఘం గాంధారి మండల శాఖ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ ను స్మరించుకుంటూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.ఈ ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు చీమల్ వార్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేతాజీ అనేక కష్టాలను ఎదుర్కొని ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేశారని అన్నారు.”మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అనే నినాదంతో యువతలో దేశభక్తి రగిలించారని . తన ప్రాణాలను కూడా దేశం కోసం పణంగా పెట్టారని గుర్తు చేశారు.నేతాజీ త్యాగమే ఈరోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి కారణమని ఆయన చూపిన మార్గంలో నడవడమే మనందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు దోల్లు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీలు నస్కంటి రవి,సామల రాజు, వంజరి రాకేష్ యూత్ అధ్యక్షులు సిందే నితిన్,టౌన్ సెక్రటరీ ఆరె కటిక మోతిలాల్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆకుల రాకేష్, ఎండ్రియాల గోపాల్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper