PS Telugu News
Epaper

కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

📅 07 Apr 2026 ⏱️ 2:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం

కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఎంపీడీవో బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బాటసారులు, వాహనదారులు సేద తీరేలా చల్లని మంచినీటి సౌకర్యం కల్పించారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీ ఓ సూచించారు. వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం చేసినారు అని అన్నారు ఈ కార్యక్రమంలో. డిప్యూటీ ఎంపీడీఓలు శంకర్ నారాయణ,సూర్య నారాయణ రాజు, పరిపాలనాధికారి సంఘమిత్ర, విద్యాశాఖాధికారి -2 వెంకటరమణ,ఏపీవో చంద్రమోహన్, కాట్రేనికోన పంచాయతీ కార్యదర్శి జె వి సత్యన్నారాయణ, మండల పరిషత్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.*

Scroll to Top