PS Telugu News
Epaper

దళిత మాజీ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసిన సంజీవ్ రెడ్డి గౌడ్ , బస్వరాజప్ప గౌడ్ లను వెంటనే అరెస్టు చేయాలి

📅 07 Apr 2026 ⏱️ 3:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

లింగప్పకు వ్యతిరేకంగా నిందితులు గ్రామంలో గ్రూప్ మీటింగ్ లు పెట్టీ ప్రజలను ఉసిగొల్పుతున్నారు.

నియోజకవర్గంలో దళితులపై బీజేపీ నాయకుల దాడులు పెరిగిపోతున్నాయి.

నిందితుల నుండి లింగప్పకు ప్రాణ హాని ఉన్నది.

ఈ నెల 10న కృష్ణ తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా.

దళిత,ప్రజా సంఘాల ఐక్య వేదిక మక్తల్

పయనిoచే సూర్యడు ఏప్రిల్7

కృష్ణా మండలం చేగుంట గ్రామంలోనీ దళిత మాజీ ఎంపీపీ లింగప్ప పై కరెంటు పోల్ విషయంలో జరిగిన ఘటనలో ఇదే గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ కొడుకు సంజీవరెడ్డి గౌడ్ బసవరాజప్ప గౌడ్లు కలిసి లింగప్ప పై మరియు భార్య, కొడుకు పై అకారణంగా దాడి చేసి లింగప్ప తల పగలగొట్టడం జరిగింది. ఈ క్రమంలో స్పృహ తప్పి పడిపోయిన లింగప్పను ఆసుపత్రికి తీసుకెళ్దామని బయలుదేరుతుంటే లింగప్ప ప్రయాణిస్తున్న కారును నిందితులు అడ్డుకొని రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన జరిగి దాదాపు పది రోజులు కావస్తున్న నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. ఇది అదునుగ చూసిన నిందితులు ఊర్లో ఉండే వివిధ వర్గాల ప్రజలను సమీకరించి లింగప్పను ఎలాగైనా సరే ఊరు విడిపించాలని, దీనికి మీరంతా సహకరించాలని ప్రజలను ఉసిగొలుపుతున్నారు. నిందితుల నుండి లింగప్ప కు ప్రాణహాని ఉన్నది.
దళిత ప్రజా ప్రతినిధి పై దాడి చేసిన కూడా ఈరోజుటికి ప్రభుత్వ యంత్రాంగం కనీస స్పందన కరువైంది. బిజెపి నాయకులు కాంగ్రెస్ దళిత నాయకుల పై దాడి చేస్తే ఆ పార్టీ ప్రతినిధులు కూడా దళితులకు అండగా నిలవడానికి ముందుకు రావడం లేదు. దళితులు ఏ పార్టీలో ఉన్నా కూడా భద్రత ఉండదనే విషయం ఈ ఘటన రుజువు చేస్తున్నది.కావున దళిత మాజీ ఎంపీపీ లింగప్పను చంపడానికి ప్రయత్నించిన సంజీవరెడ్డి గౌడ్, బసవరాజప్ప గౌడ్ లను వెంటనే అరెస్టు చేయలని, లింగప్ప ఇంటి ముందు కట్టిన కరెంటు పోల్ దిమ్మెను తొలగించాలనే డిమాండ్ తో దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన కృష్ణా తహసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత ప్రజానికం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో బాధితుడు మాజీ ఎంపీపీ లింగప్ప తో పాటు డి చంద్రశేఖర్ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, జీర్గల్ నగేష్ మాదిగ దళిత నాయకులు, KNPS నాయకులు విజయ్ కుమార్, నర్సింగప్ప లు పాల్గొన్నారు.

Scroll to Top