విద్యార్థిని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీడీ ఓ& ఎంఈఓ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం
కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ప్రతీ విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేయాలని ప్రధానోపాధ్యాయులను సూచించారు.నాణ్యమైన విద్య అందించాలని హితవు పలికారు.సదరు సందర్శనలో మండల విద్యాశాఖాధికారి వెంకట రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు & ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
