PS Telugu News
Epaper

అంగనవాడి కేంద్రాలలో పోషణ మహోత్సవాలు

📅 18 Apr 2026 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మండలం స్వతంత్రపురం అంగన్వాడి కేంద్రంలో పోషణ వారోత్సవాలు నిర్వహించారు.’ సిడిపిఓ జ్యోతి కిరణ్ ఆదేశాల మేరకు సూపర్వైజర్ లక్ష్మీనారాయణమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గర్భిణీలు, బాలింతల పిల్లల పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.చిన్న వయసు నుంచే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, భారతి, చెంగ్గమ్మ , సుభాషిణి, సురేఖ తదితరులు గర్భిణీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scroll to Top